కర్నూలు పర్యటన లో మంత్రి లోకేష్ కి రోజుకో అసమ్మతి సెగ తగులుతుంది.నిన్నటి సభ లో లోకేష్ ప్రసంగిస్తూ రాయలసీమ లో కియా మోటార్ పరిశ్రమ తీసుకొచ్చాము. రాయలసీమ కి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చాము, అలాగే కియా మోటార్ పరిశ్రమ ద్వారా లక్ష ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు.
దీనికి అక్కడే ఉన్న రాయలసీమ వాదులు లోకేష్ కి ఎదురు ప్రశ్న వేశారు మీరు ఒక్క ఉద్యోగమయిన ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రాయలసీమ ,రాజధాని ని, హైకోర్టు ని,ఎయిమ్స్ ను కోల్పోయింది అని అలాగే ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ పెడతామని చెప్పీ మూడు సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఇంతవరకు ఎలాంటి ఏర్పాటు లు చేయలేదు. అంతేకాకుండా కడప లో ఉక్కు పరిశ్రమ పెడతామని హామీ ఇచ్చి ఇంత వరకు అతి లేదు గతి లేదు అని రాయలసీమ వాదులు ఆవేదన చెందారు.
Comments
Post a Comment