Skip to main content

అనంతపురం కి ఇక సెంట్రల్ యూనివర్సిటీ లేనట్టేనా ?


అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అమరావతి లో ఏర్పాటు  చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే గత కొంతకాలంగా అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని  ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి నిన్న జరిగిన "ఎస్ ఆర్ ఎమ్" యూనివర్సిటీ శంకుస్థాపన లో ప్రసంగిస్తూ అమరావతి ని భవిష్యత్తులో నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేస్తున్నామని, ఇంకా ఎంఐటి, యాస్‌ బర్ల్కీ సంస్థలు  కూడా ఇక్కడ స్థాపించనున్నట్లు సిఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి అమరాతికి సెంట్రల్‌ యూనివర్శిటీ,  ట్రైబల్‌ యూనివర్శిటీతోపాటు మరిన్ని ప్రైవేటు విశ్వ విద్యాలయాలు కూడా రావలసి ఉందన్నారు. త్వరలోనే  వాటికి కూడా శంకుస్థాపనలు చేస్తామని సిఎం ప్రకటించారు.                
               
                                         
                                              ఇది అంత బాగానే ఉంది కాని ఒక ప్రాంతం ని అభివృద్ధి చేసి మరో ప్రాంతంని అభివృద్ధి చేయకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి.దాని ఫలితమే తెలంగాణ .అసలే రాయలసీమ లో వలసలు ఎక్కువ  మళ్లీ అలాంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది.ముఖ్యంగా రాయలసీమ లోని అనంతపురం లో సెంట్రల్ యూనివర్సిటీ తిరుపతి లో ఎయిమ్స్ కడప లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతా వరకు అతి లేదు గతి లేదు.ప్రభుత్వ లు ఇలానే చేస్తే రాయలసీమ లో కూడా మరో ఉద్యమం వస్తుంది అనడంలో సందేహం లేదు .

Comments