రాష్ట్ర నలుమూలల నుంచి చదువుకోవడానికి ,ఉద్యోగ అవకాశాల కోసం విజయవాడ,గుంటూరు వెళ్తున్న యువత కష్టాలు వర్ణనాతీతంగా ఉంది.కనీస అవసరాలు ఏవి అందుబాటులో లేవు.ముఖ్యం గా ఇక్కడి ప్రైవేట్ హాస్టల్ లో నాణ్యమైన ఫుడ్ లేకుండా విద్యార్థులు, నిరుద్యోగుల కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హోటల్స్ లో ధరలు సామాన్యుడి కి అందుబాటులో లేని రీతి లో ఉంది. దేశం రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిన కనీస అవసరాలు కల్పించ లేక పోతున్నాయి.
ఆహార భద్రత లోపాలు దేశం లో రాష్ట్రం లో రోజు రోజు కి పెరిగిపోతున్నాయి.దీని కోసం ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించలేక పోతున్నాయి..ఒక వేళ ఫుడ్ సెక్యురిటి గురించి ఫుడ్ ఇస్పెక్టర్ లు ఉన్న లాభం లేకుండా పోయింది.కొందరు లంచాలు పుచ్చుకుంటు సమాజాన్ని నాశనం చేస్తున్నారు.
ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి మీడియాకి కూడా భయం ,6 నెలల క్రితం ఒక తెలుగు మీడియా విజయవాడ లబ్బిపేట లో హాస్టల్ దందా అన్నది,పెళ్ళి కానీ ప్రసాదులు అంటూ సంబోధించింది. ఇక్కడ నివసిస్తున్న వారిని ,అమ్మాయిల ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేసింది. లబ్బిపేటలో 90% సిఎ విద్యార్థులు వున్నారు. ఏది నిజం ఏది అబ్బదం అని తెలుగు చానెల్స్ నిజాలు చూపించలేని పరిస్థితి లో ఉన్నాయి.. ప్రభుత్వాల ను పరిపాలించే రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్లు దోచుకుంటున్నారు.తినే ఫుడ్ లో కూడా అవినీతి చేస్తున్నారు. ప్రభుత్వాలు ఆహార భద్రత కోసం కఠిన నియమాలు తీసుకురాకపోతే .యువత ప్రజలు ప్రభుత్వాల పై నమ్మకాలు కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త.
Comments
Post a Comment