Skip to main content

చిత్తూరు జిల్లా చేసిన పాపం ఏమి ?




చిత్తూరు జిల్లాలో,చిత్తూరు పలమనేరు  కర్ణాటక లోని బంగారుపేట వరకు రైల్వేలైన్ వేయండి అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ లో అడిగారు. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.  ముఖ్యం గా పాల ఉత్పత్తి లో మెరుగ్గా వున్నా పలమనేరు కి దక్షిణ భారతదేశo లో  "మిల్క్ సిటీ" గా పేరుంది. కానీ ఇక్కడి రైతులు ప్రతి సంవత్సరం పంటలు పండించి గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
                                         అదే రైల్వే లైను వేసినట్టు అయితే రైతులు వారి మార్కెట్ ని విస్తరించవచ్చు. కానీ దీనికి సంబంధించి పాలకపక్షం మరియు ప్రతిపక్షం లోని నాయకులు స్పందించుటలేదు. ఏమైంది ఈ ఎమ్మెల్యేల కు ఎంపీ ల కు వారి బాధ్యతలను  ప్రజాసమస్యలను విస్మరించి వ్యాపారాలు చేసుకుంటున్నారు...ఇప్పటికైనా మన నాయకులు మేల్కొని కర్ణాటక ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపితే రైల్వే లైను వస్తుంది,ప్రజల కి కష్టాలు తగ్గుతాయి .

Comments