రాయలసీమ కి దశాబ్దాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు, పాలకులు అక్కడి వారే అయిన ప్రయోజనం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కూడా హైదరాబాద్ మీదే పెట్టడం వల్ల ఏ ప్రాంతాన్నిఅభివృద్ధి చేయలేదు.విడిపోయినప్పటికీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో నే ఎయిమ్స్ ,రాజధాని, ఇప్పుడు హైకోర్టు. ఇలా అని మళ్ళీ ఒకే ప్రాంతం లో పెట్టడం వల్ల మరో ఉద్యమాని కి నాంది పలుకుతున్నారు.
ఇదే ప్రాతం నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఉన్న ఏ మాత్రం పటించుకోవడం లేదు.ఇంతవరకు రాయలసీమ లో హంద్రీనీవా, గాలేరు ,నగరి ప్రాజెక్టులు పూర్తి కాలేదు, రాయలసీమ కి ఇది జీవనాడి.దీని గత ప్రభుత్వాలు పటించుకోలేదు ఇప్పటి పాలక ప్రతిపక్ష పార్టీల కు చిత్తశుద్ధి లేదు.ఇప్పటికే రాయలసీమ చాలా కోల్పోయింది,( బళ్ళారి, కోల్లారు, క్రిష్ణగిరి).శ్రీ బాగ్ ఒప్పందా లు ఇప్పటి వరకు అమలు కాలేదు. అది అండి మన నాయకులకు రాయలసీమ పై ఉన్న చిత్తశుద్ధి. ఇప్పటికైన మారాలి అని కోరుకుంటున్నారు రాయలసీమ వాసులు.
Comments
Post a Comment