విహెచ్ హనుమంతరావు గారు... నిన్న పవన్ కళ్యాణ్ కెసిఆర్ గారు భేటీ కావడాన్ని తీవ్రంగా తప్పు బట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు కెసిఆర్ ని కలవాలి ,ఇదేదో డ్రగ్ మాఫియా కి సంబంధించి అయివుంటుంది . ఎందుకంటే డ్రగ్ కేసులో అరెస్ట్ అయినా కెల్విన్ నిన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు , అందుకే పవన్ కళ్యాణ్ కెసిఆర్ ని కలిసాడు అని విహెచ్ ఆరోపించారు.
నిన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం కెసిఆర్ గారిని కలవడానికి కారణం ..... నూతన సంవత్సర శుభాకాంక్షలు తో పాటు ఈ రోజు నుంచి తెలంగాణ లో రైతుల కు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు . అందుకే వారికీ శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చాను అని చెప్పారు .
వీరి ఇద్దరి భేటీ చూసిన ప్రతిపక్షాలు ఇది రాజకీయ భేటీ అని ఊహించి ఎవరి కి తోచినా విధంగా వాళ్ళు విమర్శిస్తున్నారు .
విహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ నాయకుడు కూడా దిగజారుడు స్థాయి రాజకీయాలు చేస్తుంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ,ఎందుకంటే మొన్నటి వరకు కెసిఆర్ ని 24 గంటలు ఇవ్వలేదు అని విమర్శించారు .. ఇప్పుడు ఇస్తే ఆ పని ని మెచ్చుకున్నా పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారు . మంచి చేస్తే బావుంది అని చెప్పడం కూడా తప్పు ఎలా అవుతుంది హనుమంతరావు గారు .. ఎప్పుడు తిట్టుకోవడమేనా మారండయ్యా
Comments
Post a Comment