Skip to main content

బాలకృష్ణ ఫై మహీంద్రా చైర్మన్ ట్వీట్



బాలకృష్ణ నటించిన జై సింహ మూవీ ఈ మద్యే రిలీజ్ అయ్యింది అందులో ఒక సన్నివేశం హీరో బాలకృష్ణ  పోలీసుల కి వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు   బాలకృష్ణ కోపం తో పక్కనే ఉన్న బొలెరో కార్ ని పైకి ఎత్తుతాడు .  ఇది ఏకకంగా బొలెరో కార్  ని  తయారు చేసే కంపెనీ చైర్మన్  ఆనంద్ మహీంద్రా గారు చూసి ఈ విధముగా ట్వీట్ చేసారు 

"హహ .. ఇప్పుడింక  మా సర్వీసు వర్కుషాపుల్లో బొలేరో చెకప్ ల కోసం హైడ్రాలిక్ లిఫ్టులు వాడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు!! ’’అంటూ  ట్వీట్ చేశారు.  

బాలకృష్ణ గతంలో నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ ఉంటుంది. నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేసిన సీన్లలో  అది ఒకటి . బాలకృష్ణ కూడా ఆ సీన్ ఎబ్బెట్టు వుంది  అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ ఒంటిచేత్తే బొలేరో పైకెత్తే సీన్ బాగా వైరల్ అవుతోంది.
      
                                

Comments