Skip to main content

ఇదేమి పత్రికా విలువలు......??



ఇంత దరిద్రమైన పాత్రికేయ విలువలు. రోజు రోజుకి ఇటు మీడియా అటు పత్రికారంగంలో దిగజారుతనాన్ని చూసి అసహ్యం వేస్తుంది. ఆంధ్ర తెలంగాణల మధ్య జరిగిన కొట్లాటలలో
విభజనలో మీడియా లేనిపొని  విషయాలకి చర్చలు..హింసని, భావోద్వేగాలని రెచ్చగొట్టి విభజన  ను అస్తవ్యస్తంగా  జరగడానికిప్రధాన కారణం గా నిలిచింది  అని అందరికి తెలిసిన విషయమే. అప్పుడు ప్రజలతో ఆడుకున్న ఎవరి అవసరాలకి వారు జనాలని..వాడుకున్న సన్నివేశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి.

విడిపోయాక అయినా..ఇటు ప్రింట్ మీడియా అటు ఎలక్ట్రానిక్ మీడియా..అభివృద్ధి ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణంవైపుప్రజలని ఆలోచింపజేసే చర్యలు ఏమి తీసుకోవడం లేదు..!!

ఈ వార్త నేడు ఆంధ్రజ్యోతి హైద్రాబాదు ఎడిషన్ లో వేశారు..!!
నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీకు నీళ్ళు అక్కరలేదు..మీరు వేరే పంటలు వేసుకోండి అని అలా డైరెక్ట్ గా అని ఉంటే..అలా చెప్పిన అధికారులని బాధ్యులని చెయ్యాలి..ఒక ప్రాంతాన్ని ఎడారి చేసి ఆ నీళ్ళని మాకు ఇవ్వాలని ఎవరు  కోరుకోరు లేక ఒకరి రక్తం తాగి బ్రతికే మనుషులు  అసలే కాదు కావాలంటే ఇంకా మేము మాడ్చుకొని మీకు పెడతాం ఉన్నంతలో కానీ అడిగింది ఒకటి ఆయితే మార్చి ఇలా మీకు నీళ్ళే అక్కరలేదు. తెలంగాణ వాళ్ళు ఎలా అయినా చావండి అని మెయిన్ పేపర్ లో హెడ్ లైన్స్ లో ఇలా పతాక శీర్షికలు రాయడం ఏమి పత్రికావిలువలో అర్ధం కాలేదు..!!

ఈ వార్తని తెలంగాణలో వేయడం ద్వారా..ఆంధ్ర ప్రాంత మనస్తత్వం ఇది అని తెలంగాణా ప్రజలకు చూపడమా మీ ఉద్దేశ్యం. లేక ఇంకా గొడవపడి చావండి..మాకు వార్తలు లేవు అని indirect గా చెప్పాడమా..?? అసలే రెండు ప్రాంతాల ప్రజలు మంటెక్కి ఉన్నారు..
ఆంధ్రోళ్ళ కుట్రదారులు అని తెలంగాణ వాళ్ళు,  మా మనోభావాలని తీవ్రంగా దెబ్బ తీశారని ఆంధ్రోళ్ళు..ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాసి..ఇంకా విద్వేషాన్ని పెంచి పోషించలాని లక్ష్యంగా పెట్టుకున్నారా..??

మరి ఇంత ముఖ్యమైన వార్త హైదరాబాదు ఎడిషన్ లో రాసిన ఈ పత్రిక..ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఎక్కడా ఒక్కముక్క కూడా రాయకపోవడం ఏంటో అర్ధం కాని విషయం..!!
.
అయ్యా..
రాష్ట్రానికి మీరు మంచి చేయకపోయినా పర్లేదు..!!
మీ డబ్బుకోసం మీ స్వార్ధం కోసం జనాలని మాత్రం చంపద్దు..!!
.
ఇలాంటి వార్తలు రాయడం మాని..
ఏదైనా Ad ఏజెన్సీ లేక మరొకటో పెట్టుకొని బ్రతకండి..!!
కావాలంటే తలా ఒక రూపాయి పడేస్తాం..!

Comments