జానపద చిత్రాలలో రాణి అంటే ముందుగా గుర్తొచ్చే నటి కృష్ణ కుమారి . తెలుగు తమిళం కన్నడం ,మలయాళం లో నటించింది .సుమారు 110 చిత్రాలలో నటించిన ఆమె సినిమాల తర్వాత బెంగళూరు లో స్థిర పడింది . కొంత కాలంగా కాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు.
బెంగుళూరుకు చెందిన అజయ్ మోహన్ ను వివాహం చేసుకున్నాక సినిమాలు తగ్గించుకున్న కృష్ణ కుమారి పెళ్లి చేసుకున్నాక పూర్తిగా కుటుంబ జీవితానికే అంకితమయ్యారు. 1969 నుంచే సినిమాలు మానేసిన కృష్ణ కుమారి గారు ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు పోషించినప్పటికీ నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపలేదు.

కాంచన తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేసారు కాని ఆరోగ్యం సహకరించక ఆ ఆలోచన మానుకున్నారు. ప్రముఖ నటీమణి షావుకారు జానకి ఈవిడకు స్వయానా అక్కయ్య. ఎన్టీఆర్ - ఎఎన్ ఆర్ - జగ్గయ్య - ఎస్విఆర్ - కాంతారావు లాంటి దిగ్గజాలతో మరపురాని ఎన్నో సినిమాలు ఆవిడ చేసారు.
Comments
Post a Comment