ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టు వెళ్తున్నాడు . ఇది అందరికి తెలిసిన విషయమే , కానీ ఇప్పుడు ED జగన్ కి మరో షాక్ ఇచ్చింది . అది ఏమంటే జగన్ మోహన్ రెడ్డి కి సంభందించిన గృహ నిర్మాణ ప్రోజెక్టుల అక్రమాస్తుల కేసులో ED 117.74 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినట్టు ED ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.
మన దేశం లో న్యాయవ్యవస్థ చాల గోరంగా ఉంది ఎందుకంటే సిబిఐ విచారించినా 100 కేసులో 6 టికీ మాత్రమే శిక్ష పడుతుంది. ఇటీవలి కాలంలో చూసుకుంటే 2G స్కాం లో నిర్దోషులు గా విడుదలైన కనిమొళిని రాజా నే మనం చూడవచ్చు. ఆ కేసులో సుప్రీమ్ కోర్ట్ అప్పట్లో 200 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది . నేరం జరిగింది కానీ నిరూపించడం లో సిబిఐ విఫలం అయ్యింది . ధనవంతులకి రాజకీయ నాయకుల కి ఒక చట్టం సామాన్యులకి నిరుపేదలకి ఒక చట్టం ఉనంత వరకు మన దేశం లో న్యాయ వ్యవస్థ ఇలాగె ఉంటుంది.
Comments
Post a Comment