Skip to main content

నేడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి



అది 1978 సంవత్సరం  రాష్ట్రము లో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గ పోరు వల్ల రాష్ట్రము అపకీర్తి పాలయింది.  తరచూ ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు అయిదు సంవత్సరాల కాలములో నలుగురు ముఖ్యమంత్రులు మారారు.
     
              అప్పుడు రామారావు గారు 1981లో ఊటీలో సర్దార్‌ పాపారాయుడు చిత్రం    షూటింగు విరామసమయంలో ఒక విలేఖరి, మీకు ఇంకో 6 నెలల్లో 60 సంవత్సరాలు నిండుతున్నాయి కదా, మరి మీ జీవితానికి సంబంధించి ఏదైనా నిర్ణయం    తీసుకుంటున్నారా? ఆని అడిగాడు. దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను. తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నా తరువాతి పుట్టిన రోజునుంచి నా వంతుగా ప్రతీనెలలో 15రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తాను అని చెప్పాడు. ఆయన చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం.  ఆ తర్వాత 1982 మార్చి 21 న హైదరాబాదు వచ్చినప్పుడు అభిమానులు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికారు. 1982 మార్చి 29 సాయంత్రము 2:30లకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు. ఆసమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ లో తాకట్టు పెట్టారు అని నినాదించిన వ్యక్తి ఎన్టీఆర్ . 
       
రామారావు గారు ముఖ్యమంత్రి ఐయినా తరువాత ఎనో మార్పులు తీసుకువచ్చాడు అందులో కొన్ని  1984లో సినిమారంగంలో "స్లాబ్ విధానము"ను అమలుపరిచాడు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకూ పనికిరాదని శాసనమండలిని రద్దు చేసాడు (1985 జూన్ 1 న అధికారికంగా మండలి రద్దయింది). హైదరాబాదు లోని హుస్సేన్‌సాగర్ కట్టపై (ట్యాంకుబండ్ నందు) సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలు నెలకొల్పాడు. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో మార్చి 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు.  పీవీ నరసింహ రావు ప్రధాన మంత్రి గా గెలవడానికి తన వంతు కృషి చేశారు   1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మధ్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలు పరిచాడు . రామారావు గారు  ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు.  

అప్పటి చీఫ్ సెక్రటరీ ఇప్పటి లోకసత్తా పార్టీ అధ్యక్షుడు  రామారావు  గురించి ఈ విధం గ చెప్పారు . ఒకసారి రామ రావు గారి బాగా పాతది అయ్యిపోయింది కొత్తది కొనాలని అనుకోని రామారావు గారిని అడిగితే రామారావు గారు ఇలా అన్నారు అంట  ఎందుకయ్యా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారు ఆ కార్ నే బాగు చేయండి అని చెప్పారు అంట . 

Comments