Skip to main content

హై కోర్టు రూపంలో మరో ఉద్యమం .........





రాయలసీమ లోనే  హై కోర్టు ఏర్పాటు చేయాలి అని తీవ్ర స్థాయి లో  ఉద్యమం జరుగుతున్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏమి తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాయి . ఇంతకు ముందు కూడా గత  ప్రభుత్వాలు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని పంటిచుకోలేదని  రాష్ట్ర విభజన జరిగింది . ఇప్పుడు మళ్ళి అదే తప్పు చేస్తున్నాయి అమరావతి లోనే రాజధాని , సెంట్రల్ యూనివర్సిటీ , ఎయిమ్స్ , ఇప్పుడు హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం . ఇలాంటి నిర్ణయాలు వల్ల మరో ఉద్యమానికి ఆజ్యం పోసినట్టు అవుతున్నది .


విభజన చట్టం లో సెక్షన్4లో AP హై కోర్ట్ లొకేషన్ ని రాష్ట్రపతి నోటిఫై చేస్తారు అని రాసి ఉంది. కాని  రాష్ట్రపతి నోటిఫై చెయ్యకముందే   చంద్రబాబు గారు అమరావతి  లో హై కోర్ట్ కోసం ముందుకు పోవడం  ఇంత దుర్మార్గంగా , ఏక పక్షంగా ముందుకు పోతున్నా ఇది తప్పు అని నిలదీసి,సీమకు హై కోర్ట్ ఇవ్వండి అని అడిగే పార్టీలే లేవు. 

ఈ రోజు ..  రాయలసీమ లో హై కోర్ట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ లో  పెద్దలు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, IYR కృష్ణా రావు(మాజీ AP CS), కృష్ణ మోహన(మాజీహై కోర్ట్ జడ్జ్), హనుమంత రెడ్డి మాజీ IG మరియు హై కోర్ట్ లాయర్లు. అందరూ కలసి హై కోర్ట్ రాయలసీమ లో ఏర్పాటు పోరాటం లో భాగంగా మొదట సీమ జిల్లాల్లోని బార్ అసోసియేషన్లతో అందరిని కలిపి మీటింగ్ జరపాలని నిర్ణయించారు, తరువాత సీమలోని ప్రజా , విద్యార్థి సంఘాలు మరియు పార్టీలు ఏవైతే హై కోర్టు డిమాండ్ కు మద్దతుగా వుంటారు వారితో తదుపరి సమాలోచన చేసి కార్యాచరణలో ముందుకు పోవాలని నిర్ణయం అయింది. ఇప్పటికైనా  ప్రజా ప్రతినిధులు స్పందించి హై కోర్ట్ ని రాయలసీమ లో ఏర్పాటు చేస్తే మంచిది . 

Comments