విజయనగరం జిల్లాలో వలసలు.....మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం.
టిడిపి అధికారం చేపట్టిన తర్వాత సుమారు 50 వేల మంది వలసలు పోయుంటారని అంచనా...టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీలు: ఇంటికో ఉద్యోగం, ప్రతి జిల్లాలో పరిశ్రమలు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు కల్పించడం.అధికారం చేపట్టిన తరువాత హామీల అమలు మరిచిపోయిన చంద్రబాబు ప్రభుత్వం. టిడిపి అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో దిగజారిన ఆర్థిక పరిస్థితులు.
తెలుగుదేశం ప్రబుత్వం ఏర్పడిన గత మూడున్నరేళ్లనుండి కొత్తగా ఒక్క పరిశ్రమా ఏర్పాటు కాలేదు. జిల్లాలో ప్రధాన పరిశ్రమలైన జ్యూట్, ఫెర్రో పరిశ్రమలు మూతబడి సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వ్యవసాయాధారితంగా ఉన్న ఈ జిల్లాలో మూడున్నరేళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి కాలేదు. జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో లక్ష ఎకరాలకు మాత్రమే కాలువల ద్వారా నీరు అందుతోంది.
వ్యవసాయం అంతంత మాత్రం గానే ఉండటంతో, వ్యవసాయం గిట్టుబాటు కాక భూములు అమ్ముకుని నగరాలకి వలస పోయిన రైతులు. వ్యవసాయ పనులులేక దిక్కుతోచని స్తితిలో రైతు కూలీలు, సన్నా, చిన్నకారు రైతులు. ఊపాధి కరువై,ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఉపాది హామీ పదకం పనుల ద్వార వచ్చే డబ్బు జీవనానికి సరిపోక జిల్లాకు చెందిన కూలీలు, గిరిజనులు, కార్మికులు నగరాలు, పట్టణాలకు వలసపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగానూ, అపార్టుమెంట్ల వద్ద వాచ్‌మెన్‌లుగానూ, ఇళ్ళలో పని మనుషులుగానూ, హోటళ్లలో వెయిటర్లగానూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అయ్యిన వైస్సార్సీపీ కూడా ఎప్పుడు చిత్తశుద్ధి గ ప్రశ్నిచింది లేదు . ఆయన ఎప్పుడు నేను సీఎం అయ్యితే నే చేస్తా అనే ధోరణి తో ఉండడం వాళ్ళ ప్రజా సమస్యలని గాలికి వదిలేస్తున్నారు వైస్సార్సీపీ వాళ్ళు . ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా స్పందిస్తే మంచిది .
Comments
Post a Comment