Skip to main content

మరో కొత్త రాష్ట్రానికి నాంది పలుకుతున్నారు


రాయలసీమ లో ఉద్యమాలు ఉపందుకుంటున్నాయి రాయలసీమ మేధావులు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు . 

 దక్షిణ భారతదేశం వివక్ష గురించి మాట్లాడేవారు రాయలసీమ వివక్ష గురించి మాట్లాడరెందుకు?
రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటుకై ఉద్యమిస్తున్న రాయలసీమ మద్దుబిడ్డలైన న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాయలసీమ వాదులు.
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు భారతదేశం అంటే ఉత్తర భారతదేశం మాత్రమేనా దక్షిణ భారతదేశంనకు వివక్ష చూపిస్తున్నారు అనే మాట్లాడేవారికి నా ప్రశ్నలు...

1)దక్షిణ ఉత్తర భారతదేశం గురించి మాట్లాడే మీరు ఏందుకు 1953 ఆంధ్రరాష్ట్రం 1956 ఆంధ్ర ప్రదేశ్,2014 నవ్యాంద్ర ప్రదేశ్ లో భాగమైన రాయలసీమ వివక్ష గురించి ఏందుకు మాట్లాడటం లేదు.
2).విడిపోయిన నవ్వాంద్రప్రదేశ్లో ఉన్న రాయలసీమకు విభజన చట్టములో ఉన్న గుంతకల్లుకి రైల్వేజోన్ మరియు కడపకి ఉక్కుపరిశ్రమ పెట్టాలని ఏందుకు మాట్లాడటంలేదు. దక్షిణ ఉత్తర భారతదేశం అని మాట్లాడుతారు.
3).1937 నవంబర్ 16 శ్రీభాగ్ ఓప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్ట్ లేదా రాజధాని పెట్టాలని మాట్లాడరే.దక్షిణ ఉత్తర భారతదేశం గురించి మాట్లాడుతారే....
3)కోస్తా వాళ్లు 1843,1853 క్రిష్ణా మరియు గోదావరి
నదిపై బ్రిటిష్ వారు ఆనకట్టలు నిర్మించుకోని మరియు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1901సం లో బ్రిటిష్ ఇంజనీర్ మెకంజీ మల్లేశ్వరం వద్ద తుంగభద్ర నదిపై
250 టియమ్సిలతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయిస్తే
ఈ ఆంధ్ర వాళ్ల వలన ఆ ప్రాజేక్టును చిన్నదిగా కట్టడంకు పూనుకున్నారు.
1951 లో క్రిష్ణాపెన్నారు ప్రాజేక్టును వ్యతిరేఖించి 1954 లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టించుకోని,1963 లో శ్రీశైలం ప్రాజెక్టు కట్టించుకోని నీళ్లను ఆంధ్ర వారు
మూడు పంటలు మరియు
చేపలు రోయ్యల
పీతల చెరువులకు
కొబ్బరి చెట్లకు నీళ్లుకావాలి.
రాయలసీమకు తాగడానికి గుక్కేడు నీళ్లు ఇవ్వరు, ఈ వివక్షపైన మాట్లాడరెందుకు, మరి దక్షిణ ఉత్తర భారతదేశం అంటారే.....
4) కలిసి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో రాయలసీమ ఉద్యోగాల వాట 18.5 శాతం అయితే మనకు దక్కింది 2.5 శాతం ఉద్యోగాలే మరి దీని గురించి మాట్లాడరెందుకు... మరి ఉత్తర దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుతారే...
5)నీళ్లలలో నిధులలో నియమకాలలో రాయలసీమకు దశాబ్దాలుగా ఆంధ్ర వాళ్లు మోసం చేచ్చన్నారే, మరి దీని గురించి మాట్లాడరెందుకు. ఉత్తర దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుతారే....
6)విడిపోయిన తరువాత కూడా మళ్లీ అభివృద్ధి మొత్తం ఆంధ్ర లోనే కేంద్రీకరిస్తే రాయలసీమ పరిస్థితి ఏందని మాట్లాడరే... ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుతారే....
7)రాయలసీనకు హైకోర్టు
రాయలసీమకు ఉక్కుపరిశ్రమ
రాయలసీమకు సెంట్రల్ విశ్వవిద్యాలయం
రాయసీమకు 400టియమ్సిలు నీళ్లు
రాయలసీమకు రైల్వేజోన్
రాయలసీమకు ఉద్యోగాలు
రాయలసీమలో పరిశ్రమలు పెట్టెలను ఏవరు మాట్లాడరెందుకు..దక్షిణ ఉత్తర భారతదేశం గురించి మాట్లాడుతారె...
1857 నుండి 2018 వరకు వివక్ష గురి అవతున్నాం దీనిపైన మాట్లాడరెందుకు....
పై ఏ వోక్క హామీ ఇవ్వకపోయిన భవిష్యత్ లో రాయలసీమ రాష్ట్రం కు పెద్ధ ఏత్తున ఉద్యమం ఏగసిపడుతుంది...
రాయలసీమ వివక్ష పైన కాంగ్రెస్ బిజేపి టిడిపి వైయస్సార్సిపి మరియు జనసేన సిపియమ్ సిపిఐ మాట్లాడుతుందా... ?
ఇప్పటికైనా మన మారి స్పందిస్తే మంచిది . 

ఇలాంటి ఆర్టికల్స్ వల్ల  ఆయా ప్రాతాలలోని ఇబందులు తెలియచేస్తున్నాము గాని ఎవరిని రెచ్చగొట్టడం లేదు . 

Comments