ఓ అడవిలో ఒక లేడి ప్రసవవేదనను అనుభవిస్తున్నది. బిడ్డను కనడానికి అణువైన చోటుగా ఒక నదీతీరాన్ని ఎన్నుకుని అక్కడికి అతి కష్టంతో చేరుకుంది. అయితే ఆ సమయంలో
• పూర్తిగా ఆకాశమంతా మబ్బులు కమ్మేశాయి.
• మరోవైపు అడవి అగ్నికి ఆహుతి అవుతూ మంటలు ముందుకు వచ్చేస్తున్నాయ్.
• ఇంకోవైపు ఎదురుగా ఒక వేటగాడు లేడికి బాణాన్ని గురిపెట్టాడు.
• వెనుక నుండి సింహం తన ఆహారానికి అదే లేడిని ఎంచుకుని పొంచి వుంది.
ఊహించని ఈ పరిణామాలు ఒకటి తరువాత ఒకటి చుట్టుముట్టాయి. ఆ తల్లిలేడి ఇవన్నీ గమనించింది. ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంది. అదే బిడ్డను కనడం. ఎటువంటి గాయం కాకుండా జాగ్రత్తగా ప్రసవించడంపైనే దృష్టి సారించింది. అంతే తన చుట్టూ వున్న అన్ని రకాల విపత్తుల గురించి పట్టించుకునే సమయం ఇవ్వలేదు.
అంతలో ఒక భారీ వర్షం పడింది. అడవిలో వ్యాపించిన మంటలు చల్లారాయ్.
వేటగాడు గురిపెట్టి బాణం వదిలిన సమయంలో.. లేడి తన ప్రసవానుకూలతకోసం కాస్త భూమికి దగ్గరగా చేరడంతో అది గురితప్పి మాటు వేసుకుని వున్న సింహానికి తాకింది. అంతే సింహం ప్రాణ భయంతో పరుగులు తీసింది. సింహాన్ని చూసిన వేటగాడు కూడా అప్రమత్తమై ఆ స్థానం నుండి తప్పుకున్నా డు.

లేడి సురక్షితంగా తన బిడ్డకు జన్ననిచ్చింది.
ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్ధమవ్వాలి. మన స్థిర నిర్ణయాన్ని( FOCUS) ని చాలా మార్గాలలో చాలా రూపాలలో DISTRACTIONS ఎదురవుతాయి. కాని వాటిని మనం పట్టించుకుంటే చేయాల్సిన అసలు పని ఆగిపోతుంది. ఏకాగ్రచిత్తంతో మనం చేయాల్సిన పనిమీద మాత్రమే మనసును లగ్నం చేస్తే ఎటువంటి విఘ్నాలయినా తొలగి విజయం లభిస్తుంది అనేది కధాసారాంశం.
Comments
Post a Comment