Skip to main content

ఇదేమి విద్య ప్రశ్నించలేని జర్నలిజం




మన దేశం లో విద్య ,వైద్యం ఉచితం గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది .అది  రాజ్యాంగం కలిపించిన  నైతిక బాధ్యత . కానీ దాని గురించి దేశం లో  ఏ ప్రభుత్వం పాటించిన దాఖలాలు లేవు . నాణ్యమైన విద్యని అందించలేని దీన స్థితి లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వాలు మాత్రమేనా .. ? 

ప్రభత్వాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి అంటే అది నిజం గా పొరపాటే ఎందుకంటే 
ప్రశ్నించాల్సిన మీడియా కూడా వాటి గురించి  మాట్లాడాల్సిన సందర్భాలు లేవు .
 ఎందుకంటే ఆ మీడియా సంస్థలను నడుపు తున్నది ఆ రాజకీయ నాయకులే కదా ..... 

ప్రైవేట్ స్కూళ్ల లో  పిల్లలను చదివించాలి అంటే 30000 ల నుంచి 100000  వరకు ఖర్చు అవుతుంది. దీనిని తప్పు అని ప్రశ్నించలేని  మీడియా ... 

ఒకటి గుర్తించండి .. ...... ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి గెలిపిస్తే . ....
 వాళ్లేమో వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల లో, బయటదేశాలలో చదివిస్తున్నారు  . ప్రజలు రాజకీయ నాయకులను నమ్ముకొని ఓట్లేసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తునారు . 
దీని బట్టి మనకి ఏమి తెలుస్తుంది వీళ్ళు వారి పిల్లలను కూడా చదివిపించుకోలేని స్థితి లో ఉన్నారు అని . 

ఉదాహరణకి చంద్రబాబు నాయడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటూ ఆయన కొడుకు  ని కూడా ఈ దేశం లో చదివించుకోలేక పోయాడు .అలాగే వైస్ రాజశేఖర్ రెడ్డి గారు
 ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి గారిని , ఆ తరువాత జగన్ గారు ఆయన  కూతురుని కూడా బయట దేశంలో చదివించుకునే  దుస్థితి ఏర్పడింది . 

దీని ప్రశ్నించాల్సిన జర్నలిజం నిద్ర పోతు ఉంది .  



Comments